![]() |
![]() |
.webp)
బిగ్‌బాస్ హౌస్ లో ఆదివారం ఫన్ డే అంటరు. కానీ ఈ వారం అందరికి టెన్షన్ డే అనే అంటారు. ఎందుకంటే ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు బయటకు వెళ్తున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. సండే కాబట్టి మూవీ టీమ్ ని తీసుకొచ్చాడు నాగార్జున. 'కోట బొమ్మాళి పీఎస్' మూవీ టీమ్ బిగ్‌బాస్ స్టేజ్‌పైకి వచ్చేసింది. హీరో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్.. తమ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు బిగ్‌బాస్ కి వచ్చారు. ముఖ్యంగా శ్రీకాంత్, శివాజీ మంచి ఫ్రెండ్స్ కాబట్టి కాసేపు ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు.
కోట బొమ్మాళి టీమ్ వచ్చీ రాగానే తమ సినిమాలో తెగ వైరల్ అయిన 'లింగ్ లింగ్ లింగ్ లింగిడీ' సాంగ్‌కి శివానీ, రాహుల్ విజయ్ స్టెప్పులేశారు. ఇక బిగ్‌బాస్ చూస్తారా అని నాగార్జున అడగ్గానే అయ్యో సీజన్ 1 నుంచి ఇప్పటివరకు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూశానంటూ శ్రీకాంత్ చెప్పాడు. ఇక తర్వాత తమ సినిమా విశేషాల గురించి శ్రీకాంత్ వివరించాడు. కాసేపటికి కంటెస్టెంట్స్ కి పరిచయం చేశాడు నాగార్జున. " మీలో హుషారు రావాలని నా ఫ్రెండ్స్‌ని తీసుకువచ్చాను. శివాజీకి అయితే బెస్ట్ ఫ్రెండ్" అని నాగార్జున చెప్పాడు. ఇక శివాజీని చూడగానే రేయ్ బావా పక్కకి రా అంటూ చాలా ఆప్యాయంగా పలకరించాడు శ్రీకాంత్. ఇన్ని రోజులు ఎలా ఉన్నావ్ రా బాబు అని శ్రీకాంత్ అనగానే హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు.
రైతుబిడ్డ కామన్ మ్యాన్ గా అడుగుపెట్టావ్. హౌస్ లో అందరితో ఎలా ఉంటావో అనుకున్నాను కానీ నీ ఆటతో, మాటతీరుతో అందరితో కలిసిపోయావ్. ఇప్పుడు బయట నీ ఫాలోయింగ్ మాములుగా లేదని ప్రశాంత్ తో నాగార్జున అనగానే హౌస్ మేట్స్ అంతా చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత " గేమ్ అయితే చాలా బ్రహ్మండంగా ఆడుతున్నావ్" శివాజీ అంటూ శ్రీకాంత్ అన్నాడు. వరుసగా ఒక్కొక్కరిని పలకరించుకుంటూ వచ్చాడు శ్రీకాంత్. అశ్వద్దామ 2.0 సీక్రెట్ రూమ్ నుండి వచ్చాక నీ గేమ్ బాగుందని గౌతమ్ తో శ్రీకాంత్ అన్నాడు. శోభాని కన్నడలో ఎలా ఉన్నావని శ్రీకాంత్ అనగానే..
ఎప్పటిలానే కన్నడలో మొదలపెట్టింది శోభాశెట్టి. దీంతో మొదలుపెట్టారా అంటూ నాగార్జున కౌంటర్ ఇచ్చారు. పటాకా సర్.. ఫైర్ అండీ బాగా క్రాకర్‌లా పేలుతుంది అంటూ శ్రీకాంత్ అనగా.. శోభాకి క్రాక్ అన్నావా అని నాగార్జున అన్నాడు. ఇంతలో శివాజీ మధ్యలో లేచి.. "సర్ ఈళ్లు ఎవరు? ఎందుకొచ్చారు" అని అడిగాడు. నిన్ను చూడటానికి వచ్చామంటు శ్రీకాంత్ పంచ్ ఇచ్చాడు. ఇక తర్వాత మిమ్మల్ని జిమ్‌లో చూసి మీరు శివాజీ కంటే చిన్నోడని అనుకున్నాని శ్రీకాంత్‌తో అంబటి అర్జున్ అనగానే.. ఊరుకోవయ్యా మాటి మాటికి ఏజ్ గురించి మాట్లాడతావంటు శివాజీ కామెడీ చేశాడు. అవును.. అర్జున్ నిజమే బయట కూడా శివాజీ నా కంటే పెద్దోడనే అనుకుంటారంటూ ఇంకో కౌంటర్ వేశాడు శ్రీకాంత్. ఈ దెబ్బకి తలుపులు తీయండి సర్ వెళ్లిపోతాను. ఈ నరకం నేను తట్టుకోలేకపోతున్ననంటూ శివాజీ అనగానే అందరూ తెగ నవ్వుకున్నారు.
![]() |
![]() |